POLITY PRACTICE BITS TM

Indian Polity Multiple Choice Questions with Answers. TM

‘పరిత్యజించే సిద్ధాంతం’ (డాక్ట్రిన్ ఆఫ్ వేవర్)ను సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది?

భారత రాజకీయ వ్యవస్థ 03.02.2019

1. ‘భారత రాజ్యాంగ పరిషత్’ను కింది వాటిలో దేని ప్రకారం ఏర్పాటు చేశారు?

 1) సిమ్లా సమావేశం – 1945

 2) లార్డ్ వేవెల్ ప్లాన్ – 1945

 3) క్రిప్స్ రాయబారం – 1942

 4) మంత్రిత్రయ రాయబారం – 1946

2. భారత రాజ్యాంగ పరిషత్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?

 1) రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక చైర్మన్ – సచ్చిదానంద సిన్హా

 2) రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక డిప్యూటీ చైర్మన్ – ఫ్రాంక్ ఆంటోని

 3) రాజ్యాంగ పరిషత్ సలహాదారు – బి.ఎన్. రావు

 4) రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి – హెచ్.సి. ముఖర్జీ

3. 2014 డిసెంబర్ 9న ఏ భాషలోకి అనువదించిన భారత రాజ్యాంగ ప్రతిని ఆవిష్కరించారు?

 1) అరబిక్

 2) రష్యన్

 3) ఫ్రెంచి

 4) స్పానిష్

4.కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?

 1) భారత రాజ్యాంగం ఐరావతం లాంటిది – హెచ్.వి. కామత్

 2) భారత రాజ్యాంగాన్ని సర్వసమ్మతి ప్రకారం రూపొందించారు – విస్కౌంట్ సైమన్

 3) భారత రాజ్యాంగ పరిషత్ న్యాయవాదుల స్వర్గం – ఐవర్ జెన్నింగ్స్

 4) అంబేడ్కర్ రాజ్యాంగ పితామహుడు, ఆధునిక మనువు – ఎమ్.వి. ఫైలి

5. ఫ్రాన్సిస్, మాన్‌సన్, క్లోవరింగ్, బార్డ్ వెల్ ఎవరు?

 1) 1726లో మేయర్ కోర్టు న్యాయమూర్తులు

 2) 1773లో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు

 3) 1774లో కలకత్తాలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

 4) 1862లో హైకోర్టు న్యాయమూర్తులు

6. కింది వాటిలో సరైంది ఏది?

 1) కేంద్రంలో ద్వంద్వ పాలన (డయార్కీ) – మాంటెగ్-చెమ్స్‌ఫర్డ్ చట్టం (1919)

 2) కేంద్రంలో ద్విసభా విధానం – మింటో – మార్లే చట్టం (1909)

 3) వైస్రాయికే వీటో, ఆర్డినెన్స్ అధికారం – మొదటి కౌన్సిల్ చట్టం (1861)

 4) వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో తొలిసారిగా ఒక భారతీయుడికి అవకాశం – రెండో కౌన్సిల్ చట్టం (1892)

7. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రధాన సూత్రం ఏమిటి?

 1) అధికార కేంద్రీకరణ

 2) రాష్ట్రపతి నియంతృత్వం

 3) బాధ్యాతాయుత ప్రభుత్వం

 4) స్థిరమైన ప్రభుత్వం

8. సమన్యాయ పాలన ‘భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం’లో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?

 1) మినర్వామిల్స్ కేసు (1980)

 2) ఇందిరా సహాని కేసు (1992)

 3) ఎస్.ఆర్. బొమ్మైకేసు (1994)

 4) రోరిక్ ఎస్టేట్ కేసు (2011)

9. కింది వాటిలో సరికాని జత ఏది?

 1) విన్సెంట్ లీ కమిషన్ – పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు

 2) మెకాలే కమిటీ-సివిల్ సర్వీస్‌ల ఏర్పాటు

 3) అక్‌వర్‌‌త కమిటీ-రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్

 4) బట్లర్ కమిషన్ – విద్యా విధానం

10. ప్రజలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికైన వ్యక్తి రాజ్యాధినేతగా ఉండే ప్రభుత్వ విధానాన్ని ఏమంటారు?

 1) ప్రజాస్వామ్యం

 2) మోనార్కీ

 3) రిపబ్లిక్

 4) అరిస్టోక్రసీ

11. భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలను 8వ షెడ్యూల్‌లో పొందుపరిచారు. కింది వాటిలో ఆ జాబితాలోని ఒక భాష ఏది?

 1) ఇంగ్లిష్

 2) రాజస్థానీ

 3) భోజ్‌పురి

 4) కొంకణీ

12. క్రిమీలేయర్ ప్రస్తుతం ఎవరికి వర్తిస్తుంది?

 1) ఇతర వెనుకబడిన వర్గాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు

 2) ఇతర వెనుకబడిన వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడినవారు

 3) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు

 4) అన్ని కులాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు

13. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం నియమించిన తొలి కమిషన్/ కమిటీ ఏది?

 1) ఎస్.కె. థార్ కమిషన్

 2) జె.వి.పి. కమిటీ

 3) కైలాస్‌నాథ్ వాంఛూ కమిటీ

 4) ఫజల్ అలీ కమిషన్

14.కింది వాటిలో ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించని అంశం ఏది?

 1) ఆదేశిక సూత్రాలు

 2) రాష్ట్రపతి ఎన్నిక విధానం

 3) సంయుక్త సమావేశం

 4) రాజ్యసభ సభ్యుల నియామకం

15. రెండు లేదా మూడు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఎవరు ఏర్పాటు చేస్తారు?

 1) రాష్ట్రపతి 

 2) పార్లమెంట్

 3) యూపీఎస్సీ

 4) కేంద్ర ప్రభుత్వం

16. రాజ్యాంగ ప్రవేశిక ప్రస్తుత స్వభావం?

 1) రాజ్యాంగంలో అంతర్భాగం, న్యాయ సమ్మతమైంది

 2) రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, కానీ న్యాయ సమ్మతమైంది

 3) రాజ్యాంగంలో అంతర్భాగం కానీ న్యాయ సమ్మతమైంది కాదు

 4) రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, న్యాయ సమ్మతమూ కాదు

17. కింది వారిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేయనివారు?

 1) జె.ఎస్.వర్మ

 2) రంగనాథ్ మిశ్రా

 3) కె.జి.బాలకృష్ణన్

 4) బి.పి.జీవన్ రెడ్డి

18.‘పరిత్యజించే సిద్ధాంతం’ (డాక్ట్రిన్ ఆఫ్ వేవర్)ను సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది?

 1) బికాజీ నారాయణ్ Vs మధ్యప్రదేశ్ స్టేట్ (1955)

 2) భశేశ్వర్‌నాథ్ Vs ఆదాయపన్ను శాఖ (1959)

 3) బెన్నెట్, కాల్‌మన్ Vs కేంద్రం (1973)

 4) మోహినీ జైన్ Vs కర్ణాటక స్టేట్ (1992)

19. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఉద్యోగుల పదోన్నతిలో రిజర్వేషన్లు కల్పించడానికి చేసిన 77వ, 85వ రాజ్యాంగ సవరణ చట్టాలను ఏ అధికరణలో పొందుపరిచారు?

 1) 15(4)

 2) 15(4 – A)

 3) 16(4)

 4) 16(4 – A)

20. ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమైన ‘విద్యా హక్కు’ దేనిలో భాగంగా ఉంది?

 1) స్వేచ్ఛా హక్కు

 2) సమానత్వ హక్కు

 3) సహజ హక్కు

 4) రాజ్యాంగ పరిహార హక్కు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!